TG Cabinet:నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక కేబినెట్ భేటీలో పలు ముఖ్య అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, సమావేశాల వ్యవధి, ప్రవేశపెట్టనున్న బిల్లులపై దిశానిర్దేశం చేయనుంది.

అదేవిధంగా GHMC ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. GHMCతో పాటు MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. రాష్ట్ర రాజకీయ వాతావరణం దృష్ట్యా ఈ ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

రైతులకు సంబంధించి “రైతు భరోసా” నిధుల విడుదలపై కూడా ముఖ్య నిర్ణయం తీసుకునే అవకాశముంది. సాగు కాలం ముందు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు విడుదల చేసే నిధుల సమయం, విధానం పై చర్చించనున్నారు.

ఇక హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ టేకోవర్ అంశంపై కూడా మంత్రివర్గం సమీక్ష జరపనుంది. ప్రాజెక్టు నిర్వహణ, ఆర్థిక బాధ్యతలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీ రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారితీయనుంది.

Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

- Advertisement -