మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. అమెరికా భారీగా యుద్ధ సిద్ధతలు ప్రారంభించినట్లు సమాచారం. ఫైటర్ జెట్లను పెద్ద ఎత్తున మోహరిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
అమెరికా–ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలమయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. చర్చలకు బదులుగా దాడుల దిశగా అడుగులు వేస్తున్నట్టు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఎఫ్-16, ఎఫ్-22 రాప్టార్ యుద్ధవిమానాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధవిమానాల కదలికలకు సంబంధించిన వివరాలు ఫ్లైట్ రాడార్ డేటాలో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైనట్టు సమాచారం.
అమెరికా ఈ చర్యలతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి ఎలా మారుతుందో అన్నది ప్రపంచ దేశాలు ఆతురతగా గమనిస్తున్నాయి.
Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

