తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్

10
- Advertisement -

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరుపున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాధాలు తెలియజేశారు . ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబందించిన సంస్థల ప్రతినిదులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ కొత్త గవర్నమెంటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృష్హి జేస్తారని తెలియజేసారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి “గద్దర్ అవార్డులు” ప్రదానం చేస్తామని దానికి సంబందించిన విధివిధానాలు తయారు చేయాలని కోరారు.

ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి “గద్దర్” అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ FDC వారికి తెలియజేయడం జరిగింది. ఆవిధంగా త్వరలో “గద్దర్ అవార్డు” కొరకు మార్గదర్శకాలు తెలంగాణ FDC వారి సంప్రదింపులతో తయారు జేసి గౌరవ ముఖ్యమంత్రి గార్కి మరియు గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గార్కి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటునిగా, కళాకారులుగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్ గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉంది అని తెలియజేస్తున్నామన్నారు.

ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్ లో వున్న అవార్డ్స్ మీద ముఖ్యమంత్రి ” గద్దర్ అవార్డ్స్ ” పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి  A. రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నామన్నారు.

Also Read:KTR: ఉద్యోగాలపై కాంగ్రెస్ అబద్దాల జాతర

- Advertisement -