H–1B వీసాలపై టెక్సాస్ గవర్నర్

3
- Advertisement -

H–1B వీసాల అంశంపై టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ విభాగాలు, అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో H–1B వీసాల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని, మే 31, 2027 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని గవర్నర్ స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అమెరికన్ ఉద్యోగాలు అమెరికా పౌరులు, స్థానిక కార్మికులకే దక్కాలన్నదేనని గవర్నర్ ప్రకటించారు. విదేశీ నిపుణుల నియామకాల వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయన్న అభిప్రాయంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో విదేశీ వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.

టెక్సాస్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, పరిశోధకులు, అధ్యాపకులపై దీని ప్రభావం ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. టెక్సాస్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పటివరకు H–1B వీసాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ఆయా సంస్థల పని విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మొత్తంగా ఈ నిర్ణయం వలస విధానాలు, ఉద్యోగ భద్రతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందని భావిస్తున్నారు.

Also Read:సన్నీ డియోల్‌తో జ్యోతిక!

- Advertisement -