- Advertisement -
టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు సమయాన్ని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన చేశారు. ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెటు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ సూచించింది. 2011 నుంచి టెట్ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు జీవితకాలం అర్హత వర్తించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -