Tesla:భారత్‌లో టెస్లా తొలి షోరూం

6
- Advertisement -

భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభమైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు.

4,000 చదరపు అడుగుల స్థలంలో టెస్లా షోరూం ఉండగా ఇందుకోసం భారీగానే అద్దె చెల్లిస్తోంది. ఈ షోరూం లాంఛ్‌తో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఎలాన్ మస్క్ ప్రయత్నాలు ఫలించాయి.

Also Read:గవర్నర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తా!

ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు ఈసారి భారత్‌ను ఎంచుకుంది. యూరప్, చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఎలాన్ మస్క్ సంస్థ.

- Advertisement -