దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:గవర్నర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తా!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ కానుండగా బనకచర్ల ప్రాజెక్ట్ పై చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇటు గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై చంద్రబాబుతో చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు.

