దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సముద్ర తీర ప్రాంతాలతో పాటు పట్టణాల్లో నిఘాను పెంచాలని సూచించాయి. సముద్ర, నదీ మార్గాల ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి.
డ్రోన్లతో, ఐఈడీలతో దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఇవాళ తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో ఉగ్రవాదులను చొరబాటు ప్రయత్నాలు భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మరణించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.
ఏడాది కాలంగా పాక్ ఉగ్రవాదులు ఉధంపూర్, దోడా, కిష్టావర్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలు, అక్కడి నుంచి కశ్మీర్‌కు చేరుకోవడానికి కథువా ప్రధాన చొరబాటు మార్గంగా మారింది.
2008లో జరిగిన ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గంలోనే వచ్చారు.సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ మొదలైన ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read:HCU భూములు..చీకటి కోణం ఏమిటి?:హరీష్

