టీటీడీ వార్షికోత్సవాన్ని పుర్సకరించుకుని మార్చి 20-24వ తేదీ వరకు శ్రీవారి తేపోత్సవం జరగనుంది. మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.
1వ రోజు శ్రీరామచంద్ర మూర్తి సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా మూడు ప్రదక్షిణలు చేయనుండగా, రెండో రోజు శ్రీకృష్ణ స్వామి రుక్మిణి సమేతంగా అలంకరించిన తెప్పంపై మూడు ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశీర్వదిస్తారు.
శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి మూడవ రోజు మూడు ప్రదక్షిణలు, నాల్గవ రోజు ఐదు ప్రదక్షిణలు, చివరి రోజు ఏడు ప్రదక్షిణలు చేసి భక్తులను అనుగ్రహిస్తారు.
తెప్పోత్సవం దృష్ట్యా మార్చి 20, 21 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 20వ తేదీ ఉదయం 08,00-8.45 గంటలకు ద్వజారోహణం, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
Also Read:ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్