తెలుగు వారంతా చూసే..తెప్పసముద్రం

14
- Advertisement -

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో…

మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ..‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్. ‘తెప్పసముద్రం’ చిన్న చిత్రమని చెప్పలేం. ఇదొక మంచి చిత్రం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య మాట్లాడుతూ..‘‘ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను. సెకెండాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సమాజంలో యదార్థ ఘటనలను నిర్భయంగా తెరమీదకు తీసుకొచ్చారు. బాలికలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమా ఉంది. హాజీపూర్ ఘటనను తలపించేలా ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. కంటెంట్ ఉన్న ప్రతి చిన్న సినిమానూ ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఫస్ట్ టైమ్ ‘రజాకార్’ సినిమాకు గెస్ట్‌గా వచ్చా. ఇప్పుడు ‘తెప్పసముద్రం’ సినిమా కోసం వచ్చా. సైంటిస్టుల తర్వాత నేను గౌరవించేది సినిమా రంగంలోని క్రియేటర్స్‌నే. కమల్ హాసన్ ‘మహానది’ లాంటి సినిమాలు ఆలోచింప చేసేలా ఉంటాయి. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న ‘తెప్పసముద్రం’ టీమ్‌కు అభినందనలు. ఈ సినిమాకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేరు. అందరూ మధ్య తరగతివారే పని చేశారు. ‘తెప్పసముద్రం’ లాంటి సినిమా హిట్ అయితే కృష్ణానగర్‌లోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది. ‘తెప్పసముద్రం’ అనే మంచి సినిమాను తెలుగువారందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.’’ అని చెప్పారు.నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ..‘‘ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే మంచి సినిమాలు మరో పది వస్తాయి. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి’’ అని చెప్పారు.

Also Read:IPL 2024 :ఆర్సీబీకి ‘డూ ఆర్ డై’?

- Advertisement -