‘మా’ ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్తత..

77
- Advertisement -

తెలుగు సినీ అభిమానులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం మొదలైంది. ఈ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్‌ కేంద్రంలోకి ప్యానల్‌ సభ్యులు కాకుండా వేరే వ్యక్తి లోపలికి రావడంతో గందరగోళం ఏర్పడింది. పోలింగ్‌ కేంద్రంలోకి బయటి వ్యక్తి రావడంపై విష్ణు ప్యానల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా ప్రకాశ్‌రాజ్‌ గన్‌మెన్‌లు లోపలికి రావడాన్ని మంచు విష్ణు వ్యతిరేకించారు. దీంతో పోలింగ్‌ అధికారులు ప్రకాశ్‌రాజ్‌ గన్‌మెన్లను బయటకు పంపారు.

కాగా, మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. అయితే పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని రెండు ప్యానళ్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. గేటు బయట ప్రచారం చేసుకోవాలని ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. పోలింగ్‌ కేంద్రంలో మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. సమీర్‌పై ఎన్నికల అధికారికి మంచు విష్ణు వర్గం ఫిర్యాదు చేసింది. పోలింగ్‌ కేంద్రంలో నటి హేమ.. శివ బాలాజీ చేయి కొరికిందని ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ చెప్పారు.

- Advertisement -