బీజేపీ టెన్షన్ మొదలైందా?

53
- Advertisement -

తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ కమలం పార్టీలో జరుగుతున్నా అంతర్మధనం అంతా ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు పదవుల విషయంలో తీవ్ర విభేదాలు చెలరేగిన వేళ అధిష్టానం చొరవతో ఆ వివాదాలు కొంత సద్దుమనిగాయి. ఇక ఎన్నికల బరిలో దూసుకుపోవచ్చని భావించిన అధిష్టానానికీ తాజా పరిస్థితులు తలనొప్పిగా మారుతున్నాయి. కర్నాటక ఎన్నికల ఘోర ఓటమి తరువాత తెలంగాణలో బీజేపీ పూర్తిగా డీలా పడింది. నేతల్లో కూడా మునుపటి జోష్ కనిపించడం లేదు. దీంతో పార్టీ నుంచి వరుసగా జరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల బిజెపి సీనియర్ నేత కె చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే..

ఇక గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 80 మంది బిజెపి కార్యకర్తలు బి‌ఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇలా ఎక్కడికక్కడ పార్టీ నుంచి దురమౌతున్నవారి సంఖ్య క్రమేసి పెరుగుతోంది. మరోవైపు ఇంతవరుకు సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి రావడం లేదట. ఎందుకంటే నియోజిక వర్గాలవారిగా బలమైన నేతలను జల్లెడ పట్టడం ఆ పార్టీ నేతలకు పెద్ద టాస్క్ లా మారింది. ఇవి చాలదన్నట్లు ఉన్న నేతలు ఇతర పార్టీలవైపు చూడడం అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందట. మరి గెలుపే లక్ష్యంగా ఉన్న బిజెపికి తాజా పరిస్థితులు నిజంగా మింగుడు పడని విషయాలే. మొదటి నుంచి బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నప్పటికి.. తాజా పరిస్థితులు చూస్తే బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలన్నీ బిజెపి అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నాయట. మరి ఎన్నికలకు కేవలం నాలుగు నెలలే సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో పార్టీ బలోపేతం కోసం అధిష్టానం ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.

Also Read:KTR:కాంగ్రెస్ నేతలు…రాబంధులు

- Advertisement -