BJP:కొండాకు కొత్త భయం!

17
- Advertisement -

చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ,కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి, బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి తరపున మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే ఓ దఫా ప్రచారం చేయగా బీజేపీ అభ్యర్థి తనకున్న పాత పరిచయాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీ అభ్యర్థి కొండాకు కొత్త భయం పట్టుకుంది.

ఈవీఎంలో కొండాకు ఈవీఎంలో తన గుర్తు 2వ నెంబర్‌లో ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో మరో వ్యక్తి బరిలో ఉన్నారు. ఆయనకు ఈవీఎంలో ఆయన గుర్తు 5వ స్థానంలో ఉంది. తన పేరును పోలి ఉన్న మరో వ్యక్తి ఉండటం, అది తన గుర్తుకు సమీపంగా ఉండటంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోనన్న టెన్షన్ నెలకొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు కొండా. మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా చూడాలని, ఈ విధంగా ఎన్నికల కమిషన్‌ని ఆదేశించాలని కోరారు. కానీ విషయంలో ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయం అని తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం చెప్పడంతో కొండాకు నిరాశే ఎదురైంది.

Also Read:విజయ్‌తో మళ్లీ దిల్ రాజు!

- Advertisement -