రెడీ అయిన జగన్..ఎమ్మెల్యేలకు గుబులు!

57
- Advertisement -

ఏపీలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ ఆ దిశగానే వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి బరిలో నిలిచే అభ్యర్థులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాస్త కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని జగన్ ముందు నుంచే చెబుతున్నారు. అందుకే తగ్గట్టుగానే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సమయం దొరికినప్పుడల్లా స్వీట్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రజల్లో సానుకూలత ఏర్పరచుకోవాలని గట్టిగా చెబుతున్నారు. .

తన్ను ఏ ఒక్కరినీ కోల్పోయెందుకు సిద్దంగా లేనని చెబుతూ.. ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి సీటు ఇచ్చే ప్రసక్తే తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 40 మంది ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కూడా. దీంతో ఎన్నికల బరిలో నిలిపేందుకు జగన్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారు ? ఎవరు స్థానం కోల్పోతారు అనే ప్రశ్నలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయట. ఇక నియోజిక వర్గాల వారిగా ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎన్నికల బరిలో నిలిచే 72 మంది అభ్యర్థుల మొదటి జాబితాను జగన్ సిద్దం చేసినట్లు టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది దసరా సందర్భంగా ఆ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందట. దీంతో జగన్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ లిస్ట్ లో 50 శాతం పాతవారినే తిరిగి మళ్ళీ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. మరి జగన్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూడాలంటే దసరా వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read:అందరం కలిసి పనిచేస్తాం:దిల్ రాజు

- Advertisement -