Chandramukhi2:ఫస్ట్ లుక్‌

38
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. విడుదలైన ప్రతీ చోటా మంచి టాక్‌ సంపాదించుకుంది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుండగా రజనీకాంత్ ప్లేస్‌లో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు చంద్రముఖి 2 అనే టైటిల్ ఖరారు చేయగా కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటిస్తోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రముఖి 2 ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. లారెన్స్ లుక్ ఆకట్టుకోగా పాన్ ఇండియా సినిమాగా తెలుగు,తమిళ్,హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో ఈ ఏడాది వినాయక చవితికి రిలీజ్ కానుంది.

Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు పి.వాసు ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా తోట తరణి, ఆర్.డి.రాజశేఖర్ వంటి టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:నితిశ్ మళ్ళీ ఎన్డీయే లోకి?

- Advertisement -