మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కి తెలిసింది రెండే రెండు… మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్‌లో మునగడమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు ఆడుతున్న సందర్భంగా కొందరు క్రికెటర్లతో సరదాగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమ డ్రెస్సింగ్ రూం సంగతులు, ఇంకొన్ని అసక్తికర విషయాలను ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టాక్ షోలో మాజీ ఆటగాళ్లు వెల్లడించారు.
‘ టెస్టు సెంచరీ చేసిన మరునాడు భారీ ఎత్తున షాపింగ్ చేసేవాడు. సచిన్ బీరువాలో చాలా బట్టలుంటాయి. తన దుస్తుల విషయంలో సచిన్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడని అన్నారు. హైదరాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అయితే ఆలస్యానికి కేరాఫ్ అడ్రస్ అని గంగూలీ వెల్లడించారు. నాలుగో, ఐదో స్థానం ఆటగాళ్లు క్రీజ్‌లో ఉన్న సమయంలో కూడా అతను ఇంకా బాత్‌రూంలో స్నానం చేస్తూ కనిపించేవాడని.. టీమ్ బస్సులోకి అందరికంటే ఆలస్యంగా వచ్చేది కూడా లక్ష్మణే అపి అన్నారు.
శుచీ శుభ్రతా గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోని ఆటగాళ్లంటే సిద్ధూ, అజయ్ జడేజాలే అని మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ చెప్పారు. ‘ఉత్తరాదివారే దూకుడుగా ఉంటారని మేం అనుకునేవాళ్లం. దక్షిణాదివాళ్లు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారని భావించాం. కానీ కుంబ్లే తన ఆటతో వారిలోని దూకుడును చూపించాడు’ అని కపిల్‌దేవ్ అన్నారు.
‘నా విజయానికి దాదా బీజం నాటితే.. కుంబ్లే దాన్ని కొనసాగించాడు. కెప్టెన్ల మద్దతు ఉండడంతో జట్టులో నా స్థానం పోతుందేమో అని నేనెప్పుడూ భయపడలేదు. నిర్భయంగా క్రికెట్ ఆడాను. సౌరభ్ కావొచ్చు. కుంబ్లే లేదా ధోని కావొచ్చని డాషింగ్ ఒపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
టెస్టుల్లో తన రెండో సెంచరీ (అడిలైడ్‌లో ఆసీస్‌పై 87కు ఔటయ్యాడు) చేజారడానికి వీరూనే కారణమని కుంబ్లే వెల్లడించాడు. సెహ్వాగ్ తన దగ్గరకు వచ్చి.. ఎందుకంత నెమ్మదిగా ఆడుతున్నావని అన్నాడు. కాని ఆ వెంటనే తర్వాత బంతికే ఔటయ్యానని అన్నాడు.