కొంతకాలంగా హిట్ లేక సతమతమవుతున్న హీరో సందీప్ కిషన్ తాజాగా భారీ ఆశలతో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషించిన ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్గా నటించగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.
సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తెనాలి రామకృష్ణతో సందీప్ కిషన్ హిట్ కొట్టినట్లేనని చెబుతున్నారు.
ఈ మూవీ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ అని ప్రశాంతంగా చూడదగిన సినిమా అని ట్వీట్ చేస్తున్నారు. సందీప్ కిషన్ తన భుజస్కందాలపై సినిమాను నడిపించారని…ఏపీలో పొలిటికల్‌గా బాగా పాపులర్ అయిన కోడికత్తి, గ్రామ వాలంటీర్లు, కేఏ పాల్ కామెడీ వంటి సంఘటనలను సినిమాలో బాగా వాడేశారట. ముఖ్యంగా కేఏ పాల్ పాడిన పాట స్టైల్లో నటి సత్య కృష్ణన్ చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.
తమిళంలో నెగిటివ్ రోల్స్‌తో ఆకట్టుకుంటోన్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలోనూ అదరగొట్టారట. మొత్తంగా సందీప్ కిషన్…తెనాలి రామకృష్ణతో హిట్ కొట్టాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.