రానున్న మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు..

207
Temperatures
- Advertisement -

రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి.ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, రెండు రోజులుగా గాలిలో తేమ తగ్గి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవరణ శాఖ వెల్లడించింది.

వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు ఈదురుగాలులు వీస్తుండడంతో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణం కంటే 5డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

IMD

- Advertisement -