సీఎం సహాయనిధికి హైకోర్టు జడ్జిల విరాళం..

169
cm kcr

కోవిడ్ 19 మహామ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర హైకోర్టు జడ్జిలు, ఇతర న్యాయధికారులు, జిల్లా జడ్జిలు తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు.హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల జడ్జీలు, సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.

రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ న్యాయశాఖ కార్యదర్శి వెంకటేశ్వర్‌ రెడ్డి ఈమేరకు రూ. లు 61 లక్షల చెక్ ను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) నాగార్జున కూడా పాల్గొన్నారు.