గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోన్న టీవీ ఆర్టీస్ట్ అసోసియేషన్

514
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటడం కార్యక్రమంలోభాగంగా టీవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (ఎఎటీవీ) సభ్యులు ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. డా.వినోద్ బాల, విజయ్ యాదవ్, కాదంబరి కిరణ్ గార్ల ఆధ్వర్యంలో బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ ఎమ్సీ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రతి టీవీ కళాకారుడూ మూడు చెట్ల చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎఎటిటి సభ్యులు , టీవీ ఆర్టిస్టులు.. లోహిత్, శ్రీహరి, భార్గవ, శశాంక, నాగమణి, విజయ్ రెడ్డి, వాజ్పేయ్, క్రుష్ణ కిశోర్, కౌశిక్, ఆరెల్ల, అవినాశ్, అవినాశ్, బాబీ, లహరి, రాం జగన్, శ్రావణ్, రాగ మాధురి, రోహిణి, లక్ష్మిశ్రీ, మరళీ క్రుష్ణారెడ్డి, కళాధర్, రాగిణి, మధు, మురళీక్రుష్ణ, బ్యాంక్ శ్రీను,సురేందర్ రెడ్డి తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెల్లాలని ప్రతిజ్జ చేసి నినాదాలతో హషారు పుట్టించారు. కాగా… గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిశోర్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచి పాల్గొన్న సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…మొక్కలను నాటాలనే ముఖ్యమంత్రి కెసీఆర్ హరిత హారం సంకల్పానికి తనవంతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వున్నది. ఇఫ్పటికే మూడు కోట్ల అరవై లక్షల కు పైగా చేరుకోవడం గర్వకారణం. ప్రతి మనిషి బతకడానికి మూడు ముక్కలు కావాలనే శాస్త్రీయ అవగాహనను ముందుకు తెస్తూ, తనను తాను రక్షించుకోవాలంటే ప్రక్రుతిని రక్షించాల్సిందేననే మహోన్నత లక్ష్యంలో భాగంగా, సంతోష్ కుమార్ తన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్పవిషయమన్నారు. టివీ నటులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటరు కావట్టి, మా అభిమానులకు స్పూర్తిగా నిలువాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వనాలను పెంచడం అనే కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికి ఎంతో సంత్రుప్తినిచ్చింది అని పలువురు టీవీ ఆర్టిస్టులు తెలిపారు.

green challeange

green 2

- Advertisement -