తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

18
- Advertisement -

రానున్న 24 గంటలకు వెదర్ అప్‌డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. పగటిపూట మేఘావృతంతో చాలా చోట్ల వేడి నుండి ఉపశమనం ఉంటుంది అని వెల్లడించింది.

వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, జనగాం, హనుమకొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు అని తెలిపింది.

హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 37°C ఉండే అవకాశం ఉంది, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో వాన లేదా మేఘావృత పరిస్థితులు ఉండొచ్చు అని సూచించింది.

ఇక ఏపీలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40°C లోపే ఉండే అవకాశం ఉందని.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సుమారు 42°C వరకు ఉండొచ్చు అని వెల్లడించింది. విశాఖ పట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 35°C ఉండే అవకాశం ఉందని… మధ్యాహ్నం/సాయంత్రం సమయంలో ఉరుములతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:సమ్మెకే కార్మికుల మొగ్గు!

- Advertisement -