తెలుగు రాష్ట్రాలు.. భారీ వర్షసూచన

22
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని… ప్రత్యేకంగా కోమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41°C పైగా ఉండే అవకాశం, కొన్ని ప్రాంతాల్లో 44°C దాకా వెళ్లొచ్చు అని తెలిపారు.

తూర్పు తెలంగాణలో రాత్రి సమయంలో ఉరుముల వానలు పడే అవకాశం ఉంది, మధ్య & దక్షిణ తెలంగాణలో రోజంతా వానలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 40-41°C ఉండొచ్చు. మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.

రాయలసీమలో అత్యధికంగా వేడి ఉండే అవకాశం, చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40°C వరకు ఉండొచ్చు అని చెప్పారు. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి కానీ తేమ అధికంగా ఉంటుందని చెప్పారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఉరుముల వానలు పడే అవకాశం ఉందని.. విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత 34-35°C ఉండొచ్చు అని తెలిపారు అధికారులు.

Also Read:బరువు తగ్గాలనుందా..అయితే మీకోసమే!

- Advertisement -