తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో దేశవ్యాప్తంగా పాలసీ నిర్ణేతలు, సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
ఉదయం జరిగే ప్లీనరీ సెషన్‌లో పాల్గొనే ఆయన, మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో ఏఐ, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … తెలంగాణ ఏఐ పాలసీపై ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు, స్టార్టప్‌లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు అమలు చేస్తున్న విధానాలపై ఆయన వివరిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటవుతున్న ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్ర అభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయో వివరించనున్నారు. ఈ సమ్మిట్ రెండు రాష్ట్రాలకు పెట్టుబడుల దిశగా కీలక వేదికగా మారనుంది.
Also Read:AIతో కొత్త ఉద్యోగాల సృష్టి!

