లోకేష్‌ కంటే కేటీఆర్‌ బెస్ట్..!

198
ktr lokesh

టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు ఏపీ మంత్రి నారా లోకేష్‌ కంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వైపే మొగ్గు చూపుతున్నారట. ఇందుకు ప్రధాన కారణం కేటీఆర్‌ ఫ్రెండ్‌ షిప్‌ నేచర్‌తో పాటు సమస్యలపై యాక్టివ్‌గా స్పందించడంతో ఆయనతో స్నేహస్తాన్ని అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారట.

వాస్తవానికి చిత్ర పరిశ్రమలో పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ సినిమాకు రాజకీయంతో సంబంధం లేదు అని చెబుతూ కేటీఆర్ అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సింహభాగం సమయాన్ని వెచ్చిస్తూనే సినిమా ఫంక్షన్‌లకు కూడా హాజరవుతున్నారు. కేటీఆర్‌కు రాంచరణ్‌,మహేష్,నాగార్జున,సమంత మంచి స్నేహితులు. వీరితో పాటు మిగితా హీరోలతోనూ కేటీఆర్ మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తు వస్తున్నారు.

Image result for ktr bharath ane nenu

2016 లో పెళ్లి చూపులు చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించారు. రాంచరణ్ నటించిన ధృవ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ వేడుకలో కేటీఆర్ అందరిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మహేష్, కొరటాల శివతో కేటీఆర్ ముచ్చటించారు.

ఇక లోకేష్ విషయానికొస్తే కాస్త భిన్నం. నారా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి విడదీయరాని సంబంధం ఉంది. తాత ఎన్టీఆర్ లెజండరి నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. మామ బాలకృష్ణ అగ్రహీరోగా వెలుగొందారు. నారా రోహిత్ వంటి వారు ఇండస్ట్రీలో రాణిస్తు మంచి ప్రేక్షకాదరణ పొందారు. అయితే, లోకేష్ మాత్రం సినీ ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగించడంలో కేటీఆర్‌ కంటే వెనుకబడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎం తనయులతో సత్సంబంధాలు ఎవరితో కొనసాగించాలా అనే ప్రశ్న వస్తే లోకేష్ కంటే కేటీఆర్‌ వైపే సినీ ప్రముఖులు మొగ్గుచూపుతున్నారట.