జాన్వీకి అండగా అన్నయ్య అర్జున్‌..

227

కొన్ని మీడియా రాసే వార్తలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకప్పుడు నేతలపై ఘాటుగా రాస్తే.. ఇప్పుడు గ్లామరస్ బ్యూటీల మీద ఘాటుగా రాసేస్తున్నారు. ఆడిగేవాళ్ళు లేక డోస్ బాగానే పెంచేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా ఏ రేంజ్ లో ఉంటుందో ఆ వెబ్ సైట్లను తిరగేస్తే మనకే అర్ధమవుతుంది. రీసెంట్ గా ఒక మీడియా వాళ్లు అధికారిక ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వైరల్ అయ్యింది.

Arjun Kapoor

అసలు విషయం ఏంటంటే.. బోని క‌పూర్‌, శ్రీదేవిల‌ గారాల పట్టి జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లో ద‌ఢఖ్ సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా కూడా విడుద‌ల కాక‌ముందే ఈ అమ్మ‌డికి విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులే కాదు మీడియా కూడా జాన్వీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతుంది. ఆమెకి సంబంధించి ప్రతి రోజు ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురిస్తుంది. అయితే రీసెంట్‌గా ఓ వెబ్ సైట్ పొట్టి డ్రెస్ ధరించిన జాన్వీ ఫోటో పోస్ట్ చేసి, ఆమె ఏదో వేసుకోవ‌డం మ‌రచిపోయింద‌నే కామెంట్‌తో ఓ శీర్షిక ప్ర‌చురించింది.

ఇక వెంటనే హీరో అర్జున్ కపూర్ వాళ్లకి కౌంటర్ ఇచ్చేశాడు. ఈ స్థాయిలో ఓ ప్రముఖ మీడియా ఏ విధంగా ట్రాల్స్ వేస్తుందో అని ఇదొక హాస్యాస్పదం అని క్లాప్స్ కొట్టాలని చాలా నెమ్మదిగా కొట్టండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. త‌న పిన్ని శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత అర్జున్ క‌పూర్.. జాన్వీ, ఖుషీల‌ని సొంత అన్న‌లా చూసుకుంటున్నాడు. వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాన‌ని అర్జున్ క‌పూర్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే.