పోలీసుల అదుపులో జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు..

1569
jabardasth hari
- Advertisement -

బుల్లి తెర‌పై ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో. ఈ షో ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్ లు బుల్లితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. తాజాగా వ‌చ్చిన వార్త జ‌బ‌ర్ధ‌స్త్ టీం నటీన‌టుల‌కు షాక్ కు గురిచేసింది. జ‌బ‌ర్ద‌స్త్ లో చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌నిచేసిన హ‌రి అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ చేసి కోట్ల రూపాయ‌లు సంపాదించాడ‌ని అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

jabardasth

అంతేకాకుండా అత‌ని తోటి న‌టీన‌టుల‌ను కూడా త‌న‌తో పాటు తీసుకెళ్లేవాడ‌ని స‌మ‌చారం. ఇటివ‌లే విడుద‌లైన ఓ క‌మెడీయ‌న్ సినిమాకు డబ్బు సాయం చేశాడ‌ని కూడా తెలుస్తుంది. చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుంచి ఇంత పెద్ద వ్యాపారం హారి వెన‌క ఎవ‌ర‌న్నా పెద్ద‌ల హ‌స్తం ఉందా అన్న‌ట్లు పోలీసులు విచారిస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ పోలీసులు అత‌ని పేరు ప్ర‌క‌టించ‌క‌పోయినా నేడు అత‌ని పూర్తి వివ‌రాల‌తో ప్ర‌క‌టించారు.

jabardasth hari

జ‌బ‌ర్ధ‌స్త్ లో ప‌లు స్కిట్లలో అమ్మాయిల వేశాలు వేసిన హ‌రి ప్ర‌స్తుతం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గా మారాడు. హ‌రి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయ‌న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ నుంచి స్మ‌గ్ల‌ర్ గా మారడానికి గ‌ల కార‌ణాల‌ను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇటివ‌లే విడులైన శంభో శంక‌ర సినిమాకు ఇత‌ను ఆర్ధికంగా సాయం చేశాడ‌ని కూడా తెలుస్తుంది. ఇత‌నిపై దాదాపు 20కి పైగా కేసులున్నాయంటున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు.

.

- Advertisement -