14న లవర్‌ ట్రైలర్‌….

237
lover
- Advertisement -

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్. ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టిన రాజ్‌ తరుణ్‌ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి వరుస విజయాలతో అలరించాడు. అయితే తర్వాత రంగులరాట్నం,రాజుగాడు,అందగాడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని లవర్‌గా ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలై 14న సాయంత్రం 6 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌ని బట్టి చూస్తే ట్రైలర్‌ని యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

యూత్ కి నచ్చే ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి ‘రిద్ధి కుమార్’ కథానాయికగా పరిచయమవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -