13న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..!

428
kcr
- Advertisement -

ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రత్యేకంగా కలవనున్నారు. వీరిద్దరి భేటీ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య పలు అంశాలు చర్చకు రావచ్చని సమాచారం.

అలాగే తాజా రాజకీయ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు సమాచారం. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

- Advertisement -