బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..

206
bb3

బిగ్ బాస్ షో తెలుగు రియాలిటీ షోలలో బాగా పాపులర్ అయ్యింది. గడిచిన రెండు సిజన్లు విజయంవంతంగా పూర్తయ్యాయి. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 3 కూడా ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ 3లో హోస్ట్ గా నాగార్జున, అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఎక్కువగా నాగార్జున వైపే మెగ్గుచూపుతున్నారట.

అయితే బిగ్ బాస్ 3లో హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ 2లో ముగ్గురు కామన్ పిపుల్స్ కి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా కొంచెం ఫేమస్ సెలబ్రెటీలను తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ వీళ్లే…

మహాతల్లి ఫేమ్ జాహ్నవి, వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి, హీరోయిన్ శోభిత ధూళిపాళ, జబర్దస్త్ నరేష్, యాంకర్ ఉదయభాను, టీవీ ఆర్టిస్ట్ జాకీ, హీరో వరుణ్ సందేశ్,హీరోయిన్ రేణు దేశాయ్,ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ, ఆర్టిస్ట్ మనోజ్ నందన్, కమల్ కామరాజు,నాగ పద్మిని, డాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమ చంద్ర,హీరోయిన్ గద్దె సింధూర,గుత్తా జ్వాల మొత్తం 13మంది పేర్లను ఖారారు చేసినట్టు తెలుస్తుంది. జూన్ మొదటి వారంలో ఈషో ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.