రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం(వీడియో)

146
Rahul-Gandhi-flight

ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఢిల్లి నుంచి బయలు దేరగా ఆయన ప్రయాణిస్తున్న విమానం మార్గం మధ్యలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఇది గమనించిన ఫైలెట్లు వెంటనే ఆ విమానాన్ని ఢిల్లి ఎయిర్ పోర్టుకు తరలించారు. అయితే సంఘటననను వీడియో తీసి తన ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు రాహుల్ గాంధీ.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తుంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ లో ఏర్పడిన లోపాలను సరి చేసిన అనంతరం ఆయన మళ్లీ బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఇవాళ బీహార్, ఒడిషా, మహారాష్ట్రల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనాల్సి ఉంది. అయితే విమానంలో సమస్య తలెత్తడంతో జరగాల్సిన సభలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని పేర్కొన్నారు.