సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ మృతి..

248
Actor Narsing Yadav
- Advertisement -

2020లో చిత్ర పరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. టాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది 2020.. అయితే, ఈ ఏడాది చివరి రోజు కూడా ఓ ప్రముఖ నటుడుని కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. ఈరోజు ప్రముఖ సినీ నటుడు, సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని సోమాజిగూడలో గల యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు చిత్రంతో నర్సింగ్‌ యాదవ్‌ సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన స్వస్థలం హైదరాబాద్‌.. 1963 మే 15న హైదరాబాద్‌లో రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అసలుపేరు మైలా నర‌సింహ యాద‌వ్‌… ఇండ‌స్ట్రీలో అంద‌రూ నర్సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు. ఆయ‌న‌కు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు.

- Advertisement -