మునుగోడు ప్రజలు అలోచించి ఓటు వెయ్యాలి : కేసీఆర్‌

84
kcr
- Advertisement -

కృష్ణ నదిలో మా వాటా మాకు తేల్చేందుకు రేపు వస్తున్నవా అమిత్‌ షా …నిన్ను ఈ మునుగోడు ప్రజలే నిలదీస్తారన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ మునుగోడు ఎన్నిక ఏందుకు జరుగుతోందో ఎవరికి తెలియట్లేదు. ఈ దోక గోల్‌మాల్‌ ఎన్నిక, ఈ ఎన్నిక కేవలం దుర్మార్గుల కోసమేన్నారు. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్‌ పార్టీలందరం కలిసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దుర్మార్గ చర్యల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలో మేమందరం కలిసి చర్చించుకున్నామన్నారు. క్రీయాశీల ప్రగతిశీల శక్తులంతా ఒక్క తాటిపైకి రావాలని చర్చించుకున్నాము. ఈ సందర్భంగా సీపీఐ పార్టీకి ధన్యావాదాలు తెలుపుతున్నాను. టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలిపినందుకు మరోక సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి.. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగే వ్యవహారాలు, ప్రజా వ్యతిరేక వ్యవహారాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగాల్సి ఉందని జాతీయ, రాష్ట్రస్థాయి కమ్యూనిస్ట్‌ నాయకులు, ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న. గత ఐదారు మాసాలు తలకాయ అంతా పలగొట్టుకుంటున్నమ్‌. ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నం. అందులో భాగంగా ఇక్కడ విధంగా గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చిందో తెలుసు. ఏ అక్కర ఉండి వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

తెలంగాణ కొట్లాట మొదలుపెడితే ఏందాకైన కొట్లాడుతాం. మాకు కొట్లాట కొత్త కాదు అమిత్‌షా… రేపు మునుగోడుకు వస్తున్నావు కదా నిన్ను తరిమి తరిమి కొడతారు మా తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా మునుగోడు ప్రజలు తస్మాత్‌ జాగ్రత్తా. అన్నదమ్ములు వీడిపోతే ఆస్తులు పంచుతారు. కానీ కేంద్రం మాత్రం మనకు మనం వీడిపోయిన తర్వాత పంచాయితీ తేల్చకపోగా దాన్ని జటిలం చేసింది. కృష్ణానది నీళ్ల వాటా మాకు తేల్చాలని మేం కేంద్రానికి మొత్తుకుంటే గింత కూడా ఉలుకులేదు పలుకలేదన్నారు. గిదేం ప్రభుత్వంరా అని అనుకున్నా. మీరంతా ఒక్కసారి అలోచన చేయండి. రేపు వాళ్లు గెలిస్తే నన్ను గుద్ది మన బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెట్టాలంటారు. అలాంటే నేను అప్పుడే సచ్చినా మీటర్లు పెట్టని తేగేసి చేపిన్న. మా వాటా మాకు తేలిస్తే శివన్నగూడెం ప్రాజెక్ట్ నింపుకునేవాళ్లం నిన్న కాక మొన్న వర్షాలు పడి గోదావరి పొంగి పోర్లుతుంటే కాళేశ్వరం మునిగిందని ప్రచారం చేస్తున్నారు. పంపుహౌస్‌లు మునిగిపోయాయని నీళ్లు రావని అన్నారు. ఈ వర్షకాలం తర్వాత యాసంగి పంటలకు నీళ్లందిస్తమన్నారు. కేంద్రం మాత్రం మన పంటలను కొనరు.

మనమంతా కలిసి దిల్లీలో దర్నా చేస్తే ఒక గింజ కొనలేదు. ఎఫ్‌సీఐ మీదే కాదా.. మా పంటలను కొనరు. మేమంతా దిల్లీకి వస్తే డోర్‌లు మూసి సంక్షేమ ఫలాలు ఏందుకు ఇస్తున్నావు అని నన్ను బెదిరించారు. మీరు అలోచించి ఓటు వేయాలని మునుగోడు ప్రజలను కోరుతున్నా కాంగ్రెస్ కు ఒటేస్తే ఎం ఫలం దానికి ఓటేసే ముందు అలోచించి ఓటు వేయ్యండి. అక్కడ లేదు ఇక్కడ లేదు. కాబట్టి ఓటు వేసే ముందు అలోచించుకొని ఓటు వేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

- Advertisement -