తెలంగాణలో ముక్క లేనిదే ముద్ద దిగదు…

203
- Advertisement -

తెలంగాణ ప్రజల్లో మాంసం లేకుండా ఏ ఒక్క పండుగను కూడా నిర్వహించరు. కారణం తరతరాలనుండి వచ్చే ఆచార సంప్రదాయాలు కట్టుబాట్లు వంటివి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ముస్లింలు ఎక్కవగా సుమారుగా 700వందల యేళ్ల పరిపాలన చేశారు. అందులో భాగంగా పర్షియన్ అలవాట్లు కొంతమేర తెలంగాణ ప్రాంత ప్రజలకు అలవాటు పడ్డాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య అధ్యయనం ప్రకారం తెలంగాణలోని ప్రజలు సూమారుగా తలసరి వార్షిక వినియోగం కేవలం జాతీయ స్థాయిలో 5.4కిలోలైతే తెలంగాణలో మాత్రము జాతీయ సగటు స్థాయిని దాటి దానికి 4గింతలు రెట్టింపు అయినది.

తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ ద్వారా ఎక్కువగా మాంసం వినియోగంలోకి వచ్చింది. దానికి తోడు ఎగుమతులు భారీగా పెరిగాయి. తెలంగాణలో 2020-21 నాటికి 3.03లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరం 3.50లక్షల టన్నులకు పైగా విక్రయాలుంటాయని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ది సమాఖ్య పేర్కొంది. దీనికోసం రూ.31వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. గొర్రెల పంపిణీ పథకం వల్ల కొత్తగా రూ.7920కోట్ల సంపదను సృష్టించినట్లు సమాఖ్య స్పష్టం చేసింది. తెలంగాణలో యేటా లక్షా 11వేల టన్నుల మాంసం ఉత్పత్తి అదనంగా పెరిగిందని సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

కొత్త సచివాలయం..ముహూర్తం ఖరారు

సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు..

తెలంగాణొస్తే ఏమొచ్చింది..తేడా ఇదే

- Advertisement -