తెలంగాణ వెదర్ అప్‌డేట్!

14
- Advertisement -

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహా పగటి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, ఇంటీరియల్ కర్నాటక, కేరళ మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read:ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు కేటీఆర్

- Advertisement -