తెలంగాణ వెదర్ అప్‌డేట్…

290
rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ అప్‌డేట్‌ని ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి మధ్య ప్రదేశ్ మరియు దానిని ఆనుకొని ఉన్న గుజరాత్ ప్రాంతములలో అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధముగా కచ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

కచ్ మరియు దాని పరిసర ప్రాంతముల నుండి గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ వరకు మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్ మరియు ఝార్ఖండ్ మీదుగా
2.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడింది.ఉత్తర బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 9 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -