తెలంగాణ వెదర్ అప్‌డేట్…

182
hyd
- Advertisement -

రాగల మూడు రోజుల వరకు వెదర్ రిపోర్ట్‌ను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న విదర్భ మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ చత్తీస్గఢ్ ప్రాంతాలలో 1.5 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కి.మీ. నుండి 2.1 కి.మీ. మధ్య కేంద్రీకృతమై ఉన్నది.

నిన్న క్రింది స్థాయి తూర్పు గాలులలో అంతర్గత తమిళనాడు నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీన పడింది.

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హెచ్చరిక: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు వికారాబాద్ అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -