తెలంగాణ వెదర్ అప్‌డేట్..

7
- Advertisement -

రాష్ట్రంలో ఇవాళ,రేపు రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ నల్గొండ , సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈనెల 19వ తేదీ వరకు అదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తూగడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read:ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక

- Advertisement -