తెలంగాణలో పంట సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 46% భూముల్లోనే పంట సాగు చేశారు రైతులు. 132 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 61 లక్షల ఎకరాల్లోనే రైతులు పంట సాగు చేశారని నివేదిక విడుదల చేసింది వ్యవసాయ శాఖ.
ప్రధాన పంటైన వరి విస్తీర్ణం 62.78 లక్షల ఎకరాలు కాగా కేవలం 7.78 లక్షల(12.46%) ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు రైతులు. 48.93 లక్షల ఎకరాలు ఉండే పత్తి 38.57 లక్షల ఎకరాల్లో, 6.70 లక్షల ఎకరాలు ఉండే కంది 3.44 లక్షల ఎకరాల్లో, 5.21 లక్షల ఎకరాలు ఉండే మొక్కజొన్న 4.50 లక్షల ఎకరాల్లో, 4.20 లక్షల ఎకరాలు ఉండే సోయాబీన్ 3.31 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు రైతులు.
వీటితో పాటు పప్పు ధాన్యాలు, నూనె గింజల పంట సాగు కూడా తగ్గిపోయిందని తెలిపింది వ్యవసాయ శాఖ. ఊహించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్లనే పంట సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు వ్యవసాయ శాఖ అధికారులు.
Also Read:ఆర్సీబీ విక్టరీ పరేడ్..హైకోర్టుకు నివేదిక

