తెలంగాణ వెదర్ అప్‌డేట్…

212
Heavy Rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేందరం. నైరుతి నుండి వీచే గాలులు క్రమంగా జూన్ 1వ తేదీ నుండి బలపడటం వలన నైరుతి ఋతుపవనాలు సుమారుగా జూన్ (JUNE) నెల 3వ తేదీన కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయి.

నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ మీదగా విదర్భ వరకు వున్న ఉపరితల ద్రోణి. మరియు తమిళనాడు &పరిసర ప్రాంతాలలో వ్యాపించి ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడినవి.ముఖ్యంగా పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గాలులు తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి.

రాగల 3 రోజులు (31,01,02వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 3 రోజులు (31,01,02వ.తేదీలు) ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయని తెలిపింది.

- Advertisement -