రాగల మూడు రోజులు అలెర్ట్‌… : వాతావరణ శాఖ

34
rains
- Advertisement -

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉన్నందున్న…. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నందున్న…. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

- Advertisement -