తెలంగాణ వెదర్ అప్‌ డేట్..

252
rains

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 km ఎత్తు వరకు కొనసాగుతోంది.తూర్పు-పశ్చిమ shear zone Lat.16.0 deg.N వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 4.5 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km నుండి 3.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20 వ తేదీ న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.రాగల మూడురోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, కోమురంభీం –ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.