తెలంగాణ వెదర్…అప్‌డేట్

288
telangana weather report
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది వాతావరణ శాఖ.ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు(ఆగష్టు 4 వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది.

ఇది ఈరోజు (ఆగష్టు 4 వ తేదీన) ఉదయం 08.30 గంటలకు పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీరాలకు దగ్గరలో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.ఇది రాగల 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది.

ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

- Advertisement -