- Advertisement -
రాష్ట్రంలో నేడు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతాయని పేర్కొంది. అదేవిధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వానలు పడుతాయని వెల్లడించింది.
- Advertisement -