నిఖిల్ కుమార్‌ ‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్

239
ryder
- Advertisement -

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడ‌ర్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 11న శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నిఖిల్ కుమార్ ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లో ఉన్నార‌నీ, గూండాల‌ను చిత‌గ్గొడుతున్నార‌నీ వాళ్లు చెల్లాచెదురుగా కింద‌ప‌డిపోవ‌డం తెలియ‌జేస్తుంది. ‘రైడ‌ర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న‌ట్లుగా ఆ ఫ‌స్ట్ లుక్‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు.

ఫ‌స్ట్ లుక్‌తో పాటు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ మ‌రింత వివ‌రంగా హీరో చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెలియ‌జేస్తోంది. హీరో బాస్కెట్ బాల్‌ను విసిరేయ‌డం, ఆ త‌ర్వాత ర‌న్నింగ్ చేస్తూ గూడ్స్ కంటైన‌ర్ల మ‌ధ్య త‌న‌పైకి వ‌చ్చిన గూండాల‌ను ఉతికి ఆరేసిన‌ట్లు చూపించ‌డం క‌నిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియ‌స్ యాక్ష‌న్ హీరోగా మ‌న ముందుకు రానున్నార‌నే అభిప్రాయాన్ని ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ క‌లిగిస్తున్నాయి.

‘రైడ‌ర్‌’లో నిఖిల్ కుమార్ స‌ర‌స‌న నాయిక‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు.అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

తారాగ‌ణం:యువ‌రాజా నిఖిల్ కుమార్‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్‌, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కె.ఆర్‌. పీట్‌, నిహారిక‌, సంప‌ద హుళివ‌న‌, అనూష‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌: న‌ంద్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాష్‌
డైలాగ్స్‌, కో-డైరెక్ట‌ర్‌: శ‌ర‌త్ చ‌క్ర‌వ‌ర్తి
మ్యూజిక్‌: అర్జున్ జ‌న్యా
సినిమాటోగ్ర‌ఫీ: శ్రీ‌ష ఎం. కుడువ‌ల్లి
ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌
స్టంట్స్‌: డాక్ట‌ర్ ర‌వివ‌ర్మ‌
ఆర్ట్‌: మోహ‌న్ బి. కెరే
క్రియేటివ్ హెడ్‌: సునీల్ గౌడ‌
నిర్మాత‌: చ‌ంద్రు మ‌నోహ‌ర‌న్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా

- Advertisement -