తెలంగాణలో 3రోజుల పాటు భారీ వర్షాలు

39
weather
- Advertisement -

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. రేపు ఎల్లుండి అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఇవాళ ఉత్తర దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ దక్షిణ కోస్టల్‌ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.

- Advertisement -