కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పైన తెలిపిన shear zone తో విలీనం అయ్యింది.
జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంది.ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ మరియు వికారాబాద్
జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.