ప్రారంభమైన పోలింగ్..ఓటేసిన హరీష్

203
harish
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు. పోలింగ్‌పై అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం, పార్టీలు పలు ర్యాలీలు నిర్వహించడంతో ఓటర్లు పోలింగ్ వేసేందుకు తరలుతున్నారు.

ఉదయం 7 గంటలకు సిద్దిపేట బూత్‌ నెంబర్‌ 107లో హరీష్‌రావు, తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే.. మంచి ప్రభుత్వం రావాలంటే.. మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుకోవాల్సిందిగా కోరారు.

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గొల్లగూడెంలో తుమ్మల ఓటు వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున పాలేరు నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని మొదటి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొడంగల్‌లో మాత్రం 7.45వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు.

- Advertisement -