- Advertisement -
నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఉండగా గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 30°C ఉండవచ్చు అని తెలిపారు అధికారులు.
ఇక ఆంధ్రప్రదేశ్లో మేఘావృత పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించారు. విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 32-33°C ఉండవచ్చు, రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read:IPL:ఐపీఎల్ ఫైనల్ ఎక్కడో తెలుసా!
- Advertisement -

