కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం..

268
KTR
- Advertisement -

నాలుగేళ్ల కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి కృషిచేశామని…ప్రతి సంవత్సరం 40 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చుపెట్టామన్నారు. తాగు,సాగు నీటితో పాటు యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

పాలనలో అవినీతికి చోటు ఇవ్వలేదన్నారు. టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన పథకాలు దేశానికి దిక్సూచిలా మారాయని…45కి పైగా జాతీయ పురస్కారాలు వచ్చాయన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కాళేశ్వరాన్ని నాలుగేళ్లలోనే నిర్మింమన్నారు. త్వరలోనే తెలంగాణ కోటి
ఎకరాల మాగాణిగా మారబోతుందన్నారు.

ఇప్పటికే 22,000 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు చేరిందని ఎన్నికల నాటికి ప్రతి ఇంటికీ నీరు అందించి తీరుతామన్నారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎవరిలోనూ అసంత్తప్తి లేదని ఉంటే గత నాలుగేళ్లలో జరిగిన ఎన్నికల్లో అది ప్రతిబింబించేదన్నారు. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిచోట టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని స్పష్టం చేసిన కేటీఆర్…మళ్లీ కేసీఆరే సీఎం అవుతారన్నారు.

- Advertisement -