ధాన్యం సేకరణలో తెలంగాణ టాప్‌: మంత్రి కేటీఆర్

273
ktr
- Advertisement -

ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…తెలంగాణ రైతులు,ప్రజలు ఇది గర్వించదగ్గ సందర్భమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు.

దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేశామని కేంద్రమంత్రి పాశ్వాన్ వెల్లడించారు. ఇందులో తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేయగా, ఏపీ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

- Advertisement -